కూసుమంచి, ఆగస్టు 26 : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతున్నదని, కుల వృత్తులను ప్రోత్సహించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
కూసుమంచిలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో గల 100 మంది గౌడ కులస్తులకు సోమవారం కాటమయ్య కిట్లు అందజేశారు. ముస్తాదు వేసుకున్న గౌడన్నలతో మంత్రి మాట్లాడి.. కిట్ల ఉపయోగం గురించి తెలుసుకున్నారు. కిట్లు ఎలా పనిచేస్తాయి.. వాటి వల్ల కలిగే ఉపయోగాల గురించి శిక్షకులు వివరించారు.
కార్యక్రమంలో ఏసీ మధుసూదన్‌నాయక్, ఎక్సైజ్ అస్టెంట్ కమిషనర్ వేణుగోపాల్‌రెడ్డి, ఆర్డీవో గణేశ్, క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తంబూరి దయాకర్‌రెడ్డి, డీబీసీడబ్ల్యూవో జ్యోతి, ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం 41 గ్రామ పంచాయతీల్లో గల ముఖ్య నాయకులతో వివిధ అంశాలపై మంత్రి చర్చించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో నాయకులు బేబీ స్వర్ణకుమారి, గురవయ్య, రవికుమార్, బాలకృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, సుధాకర్‌రెడ్డి, రాంరెడ్డి, హఫీజుద్దీన్, దామోదర్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, ఇతర మండలాల నాయకులు రామసహాయం నరేశ్‌రెడ్డి, జగదీశ్, ఆర్.అరవిందరెడ్డి, బెల్లం శ్రీను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.