ప్రపంచ కార్మికులారా ఏకం కండి.. శ్రమ దోపిడీ విముక్తికై పోరాడండి’..అంటూ కార్మిక సంఘాల నేతలు నినదించారు. ‘కార్మిక హక్కుల సాధన కోసం ఉద్యమించండి’ అంటూ పిలుపునిచ్చారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా వివిధ పార్టీలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బుధవారం వేడుకలు నిర్వహించారు.
కార్మిక సంఘాల నేతలు మాట్లాడుతూ.. అనేక పోరాటాల ఫలితంగానే కార్మికులు హక్కులు సాధించుకున్నారని వివరించారు. ఖమ్మం ఏఎంసీ వద్ద కార్మిక సంఘం నిర్వహించిన ర్యాలీలు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. వివిధ ప్రాంతాల్లో ఆయా సంఘాల నాయకులు పాల్గొని కార్మిక జెండాలను ఎగురవేశారు.
– నమస్తే నట్వర్క్