సంక్షేమ పథకాలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. నగరంలోని 57వ డివిజన్ నుంచి బత్తుల తిరుమలరావు ఆధ్వర్యంలో సంపంగి లక్ష్మయ్య ఖమ్మం నియోజకవర్గం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఆయనకు పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు.
ఖమ్మం, అక్టోబర్ 31: సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని మంత్రి అజయ్‌కుమార్ అన్నారు. నగరంలోని 57వ డివిజన్ నుంచి బత్తుల తిరుమలరావు ఆధ్వర్యంలో సంపంగి లక్ష్మయ్య ఖమ్మం నియోజకవర్గం మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. మంగళవారం క్యాంప్ కార్యాలయంలో మంత్రి ఆయనకు పార్టీ కండువా కప్పి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్లు పసుపులేటి వెంకటేశ్వరావు, తమ్మిశెట్టి వెంకటనారాయణ, బత్తుల తిరుమలరావు, సంకురాత్రి ప్రసాద్, దండగల రాంబాబు, కుంచపు వెంకటేశ్వర్లు, వీరారెడ్డి, సీఆర్ రాజు, తమ్మిశెట్టి శివ, లక్ష్మయ్య, బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, శీను తదితరులు పాల్గొన్నారు.
చర్చిలో మంత్రి అజయ్ ప్రార్థనలు
ఖమ్మం, అక్టోబర్ 31: నగరంలోని రోటరీనగర్‌లో ఉన్న గుడ్ షెపర్డ్ చర్చ్‌లో రెవ.సత్యపాల్ అధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ప్రత్యేక ప్రార్ధనలో మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధి అజయ్‌కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అజయ్‌కుమార్ మాట్లాడుతూ.. ఖమ్మంలో తనకు అన్ని మతాలు సమానమేనని, ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను ముందు నిలబడి అండగా ఉన్నానని అన్నారు. సర్వమత సమ్మేళనమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అజయ్‌కుమార్ గెలుపును కాంక్షిస్తూ పాస్టర్లు ప్రార్థనలు చేశారు. మంత్రితో పాటు సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, జాన్ కాంతా రావు, ప్రవీణ్‌కుమార్, క్రిష్టఫర్, ఆనంద్ బాబు, సజ్జన్ పాల్, బి.ప్రసాద్ రావు, కేజే రావు, బాబురావు, సంజీవ్‌రావు, రమేశ్ పాల్, సెల్వరాజ్, రవి కిషన్, స్టీఫెన్ పాల్, కంచర్ల దయాకర్, వేణు, రాజు, జోజి రమేశ్, వేణు వర్ధన్, జకర్య నాగుల్ మీరా, ఏళ్లంకి సుధాకర్ ఉన్నారు.
ప్రముఖులను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం, అక్టోబర్ 31: ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని మామిళ్లగూడేనికి చెందిన పలువురిని మంత్రి అజయ్‌కుమార్ కలుసుకున్నారు. గూడవర్తి రామారావు వారి కుమారులు గూడవర్తి శ్రీనివాసరావు, నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్ధి అజయ్‌కుమార్ శాలువతో సత్కరించారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతి తెలిపి గెలిపించాలని కోరారు. మంత్రితో పాటు డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, స్థానిక కార్పొరేటర్ బుడిగెం శ్రీనివాస్, నాయులు శీలంశెట్టి వీరభద్రం తదితరులు ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

