ఆళ్లపల్లి, ఫిబ్రవరి 14 : పిల్లలు క్రీడల(Sports) పట్ల ఆసక్తి పెంచుకోవాలని విద్యాశాఖ అధికారి శాంతారావు (MEO Shantha Rao) అన్నారు. మైలారం ప్రభుత్వ పాఠశాలలో క్రీడా సామగ్రి పంపిణీ చేసి మాట్లాడారు. ఆటలు ఆడటం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని, విద్యార్థులు క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లో రాణించి దేశానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఆటలపై మక్కువతో చదువును నిర్లక్ష్యం చేయొద్దన్నారు. విద్యతోనే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరు బాగా చదవాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జోగా రాంబాబు, జి. కుమార్ రాజా, అంగన్వాడీ టీచర్ బాయమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Bhagyashri Borse | దుల్కర్ సల్మాన్ ‘కాంత’లో హీరోయిన్గా భాగ్యశ్రీ భోర్సే.. ఫస్ట్ లుక్ రిలీజ్