Dulquer Salmaan Kaantha | మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, దగ్గుబాటి రానా మల్టీస్టారర్‌గా వస్తున్న చిత్రం ‘కాంత’. ఈ సినిమాకు తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ పతాకాలపై రానా దగ్గుబాటి, దుల్కర్ సల్మాన్, ప్రశాంత్ పొట్లూరి, జోమ్ వర్గీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 1950 మద్రాస్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా రాబోతుండగా.. ఈ చిత్రం మానవ బంధాలు, సామాజిక మార్పులతో గొప్ప అనుభూతిని పంచేలా ఉంటుందని దర్శకుడు ఇప్పటికే ప్రకటించాడు.
ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ ఇప్పటికే దుల్కర్ ఫస్ట్‌లుక్‌ని పంచుకోగా.. దుల్కర్ రెట్రో స్టైల్లో అలరిస్తున్నాడు. అయితే వాలంటైన్స్ కానుకగా తాజాగా భాగ్యశ్రీ బోర్సే ఫస్ట్ లుక్‌ని విడుదల చేసింది చిత్రబృందం. తెలుగు, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
In the echoes of history, her love still whispers. 🩷✨#BhagyashriBorse in #Kaantha @dulQuer @RanaDaggubati @DQsWayfarerFilm @SpiritMediaIN pic.twitter.com/p22gvUjnQ8
— AB George (@AbGeorge_) February 14, 2025