
చింతకాని: సీఎం కేసీఆర్ రూపోందించిన మండలానికి ఒక మెగా పల్లెపార్క్ను త్వరితగతిన నిర్మించాలని ఎంపీడీవో బీ రవికుమార్ అన్నారు. మండల పరిధిలో ప్రోద్దుటూరు గ్రామంలో బృహత్(మెగా) పల్లెపకృతివనానికి కేటాయించిన స్ధలాన్ని సర్పంచ్ తుడుం రాజేశ్, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, జడ్పీటీసీ పర్చగాని తిరుపతి కిశోర్లతో కలసి పరిశీలించి స్ధానికంగా జరుగుతున్న పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రోద్దుటూరులో 9ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న పల్లెపార్క్ మండలంలోని అన్ని గ్రామాలకు తలమానికంగా నిలవనున్నదని, బృహత్ పల్లెపార్క్లో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మొక్కలు నాటి సంరక్షిస్తూ ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.
గ్రామాలను హరితవనాలుగా తీర్చిదిద్దుతూ, సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పల్లెలకు నెలనెలా కేటాయిస్తున్న నిధులతో సర్పంచులు పల్లెల్లో అభివృద్ది పరుగులు పెట్టిస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా హరితతెలంగాణ అనే మహోద్యమంలో ప్రతిఒక్కరూ భాగస్వామ్యులను చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, ఉపసర్పంచ్ తుళ్ళూరి అచ్చయ్య, ఎంపీటీసీ పెంట్యాల భారతమ్మ, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్, కార్యదర్శి ప్రణీత, సిబ్బంది పాల్గొన్నారు.