ఎగిరింది ఎర్రజెండా..
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా వాడవాడలా ఎర్రజెండా ఎగిరింది. మేడే సందర్భంగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పల్లె, పట్టణం తేడాలేకుండా శుక్రవారం అరుణ పతాకాలు రెపరెపలాడాయి. కార్మికులంతా జెండాలను చేతబూని పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు.
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఘనంగా మేడే వేడుకలు
- కార్మిక సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో ర్యాలీలు
- బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గులాబీజెండాల ఆవిష్కరణ
- కేసీఆర్ పాలనలోనే కార్మికుల సంక్షేమం: అజయ్
నమస్తే నెట్వర్క్, మే 1 : ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా వాడవాడలా ఎర్రజెండా ఎగిరింది. మేడే సందర్భంగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పల్లె, పట్టణం తేడాలేకుండా శుక్రవారం అరుణ పతాకాలు రెపరెపలాడాయి. కార్మికులంతా జెండాలను చేతబూని పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు. కార్మికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు. వక్తలు, కార్మిక నేతలు మాట్లాడుతూ నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హకులను కాపాడుకోవడానికి కార్మికులంతా సంఘటితంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఖమ్మం రైతుబజార్ ఆటో అడ్డా వద్ద మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గులాబీజెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల ఐక్యత, హక్కుల సాధనకు మేడే ప్రతీకగా నిలిచిందన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేశారని గుర్తుచేశారు. కార్మికుల హక్కులను కాపాడటం, సామాజిక భద్రత కల్పించడంలో రాష్ట్రంలోని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అనేకరంగాల్లో అసంఘటితంగా ఉన్న కార్మికులకు బీఆర్ఎస్ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు ఆయా చోట్ల గులాబీ జెండాలను ఎగురవేశారు. రామవరం టీబీజీకేఎస్ కార్యాలయంలో ఆ సంఘం రాష్ట్ర ముఖ్య ప్రధాన కార్యదర్శి కాపు కృష్ణ, కూసుమంచిలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి తదితరులు మేడే పతాకాలను ఎగురవేశారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
Marnus Labuschagne | 49 ఏళ్లలో ఒకేఒక్కడు.. భారత దిగ్గజం సరసన లబూషేన్..!
Singireddy Niranjan Reddy | నార్లపూర్ పంపు ఆన్ చేయకపోతే కార్యాచరణకు సిద్ధం : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Stock Markets | భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 22,400 దిగువకు నిఫ్టీ..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

