నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 8 : కాంగ్రెస్‌కు ఒక్కసారి ఓటు వేసి గోసపడుతున్నామని, ఈసారి కందనూలు మున్సిపాలిటీలోని అన్ని వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటామని ప్రజలు హామీ ఇస్తున్నారని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం మున్సిపాలిటీలోని 8, 20, 21, 23 వార్డుల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ వారు చెప్పే కల్లబొల్లి మాటలను నమ్మవద్దని, ఇచ్చిన హామీల్లో ఏఒక్కటి నెరవేర్చలేకపోతుందని, మళ్లీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లడగడానికి వచ్చేందుకు వారికి సిగ్గుండాలని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలైన మహిళలకు రూ. 2500 భృతి, రూ.4వేల ఫించన్ ఇస్తామని చెప్పి మోసం చేశారన్నారు. ఈ రెండున్నరేండ్లలో అవ్వతాతలకు కాంగ్రె స్ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.60 వేల చొప్పున బాకీపడ్డారన్నారు. కేసీఆర్ కల్యాణలక్ష్మి ఇస్తే దానికి తోడుగా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తామని గొప్పలు చెప్పి ఇచ్చే కల్యాణలక్ష్మీకి సైతం తమ పార్టీ వారు కాదంటూ గ్రామాల్లో ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి తనయుడు నాగం శశిధర్‌రెడ్డి ఆదివారం నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ లోని పలు వార్డుల్లో ప్రచా రం నిర్వహించారు. బీఆర్ఎస్ హయాంలో మున్సిపాలిటీ జరిగిన అభివృద్ధికి పట్టం కట్టాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈసందర్భంగా 6, 20వ వార్డు అభ్యర్థులు, జెట్టి కిశోర్, అలివేలను గెలిపించాలని ప్రచారం కొనసాగించారు. 6, 9వ వార్డులో అభ్యర్థి నిర్మలమ్మ ఇంటింటి ప్రచారం చేశారు. కారక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.