ఆరోగ్యవంతమైన సమాజ ఏర్పాటుకు పచ్చదనంతోనే పరిష్కారం లభిస్తుందని ఆలోచన చేసిన తెలంగాణ ప్రభుత్వం పంచాయతీకో నర్సరీ దిశగా అడుగులు వేసి ఆచరణలో పెట్టింది. జాతీయ ఉపాధిహామీ పథకం నిధులతో తెలంగాణ ప్రభుత్వం నర్సరీలను సొంతంగా ఏర్పాటు చేసింది. ఐదేళ్లుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న ఈ యజ్ఞంలో పల్లెలన్నీ హరిత వనాలుగా మారి పచ్చదనంతో పరిఢ విల్లుతున్నాయి. ప్రతీ గ్రామ పంచాయతీని యూనిట్‌గా తీసుకొని కావాల్సిన మొక్కలను స్థానిక నర్సరీల్లోనే పెంచేందుకు ప్రభుత్వం పూనుకోగా.. 2018లో 10లక్షల మొక్కలతో మొదలైన జీపీ నర్సరీలు.. 2022-2023లో 46.80లక్షల మొక్కలే లక్ష్యంగా పెంపకం చేపట్టాయి. 5,890 ప్రైమరీ బెడ్లతో మొక్కల పెంపకాన్ని నిర్వహిస్తున్నాయి.
కూసుమంచి, ఏప్రిల్ 20 : పచ్చని చెట్లు-ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎత్తుకుంది. చెట్లు లేకపోతే మనుషులు, పశుపక్షాదులు, జీవరాసులకు మనుగడ లేదని భావించిన సీఎం కేసీఆర్, పల్లెలను వనాలుగా మార్చేందుకు హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. ముందుగా 589 గ్రామాల్లో వంద శాతం నర్సరీలను ఏర్పాటు చేశారు. వాటిలో తీరొక్క మొక్కలు పెంచుతూ వేసవిలోనూ నిరంతరం నీరందిస్తున్నారు. ఏటా చేపట్టే హారితహారం కార్యక్రమంలో మన మొక్కలు మనమే నాటుకునే విధంగా పెంచుతున్నారు. రోజురోజుకూ పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు పల్లెలతోపాటు రోడ్ల వెంట మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. పూలు, పండ్లు, నీడనిచ్చే, ఔషధ మొక్కలు, ఎవెన్యూ ప్లాంటేషన్‌తోపాటు రైతులకు ఉపయోగపడే టేకు, వెదురు వంటి మొక్కలను పెంచుతున్నారు. ప్రతీ ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వడంతోపాటు ప్రభుత్వ స్థలాలు, ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ, రహదారుల వెంట హరితహారం కింద వివిధ శాఖలకు దత్తత ఇచ్చి మొక్కలు పెంచుతున్నారు. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వచ్చే వానాకాలం కోసం నర్సరీల్లో మొక్కలను ముమ్మరంగా పెంచుతున్నారు.
పూల మొక్కలు : మందార, గులాబీ, చామంతి, బంతి, గన్నేరు వివిధ రంగుల్లో, నిద్రగన్నేరు, ఎకోమా, క్రోటాన్స్, మల్లె, నూరువరహాలు, సన్నజాజులు, కనకాంబ్రాలు, లిల్లీ, ముద్ద మందారం.
పండ్ల మొక్కలు : జామ, మామిడి, దానిమ్మ, నేరేడు, జిన్నె, బొప్పాయి, గంగరావి, రేగు.
నీడనిచ్చే మొక్కలు : పెద్దతంగేడు, రేలా, చింత, వేప, కబందం, గుల్మెహర్, సీమ తంగేడు, దేవకాంచన, గానుగ, ఎకోమాతోపాటు మరికొన్ని మొక్కలను రోడ్లు, ఖాళీ స్థలాల్లో నాటడానికి పెంచుతున్నారు.
ఔషధ మొక్కలు : రణపాల, తులసి, గోరింటాకు, వాము, కలబందతోపాటు వెదురు, మునగ, నిమ్మ, కొబ్బరి వంటివి పెంచుతున్నారు. అన్ని నర్సరీల్లో ఈ మొక్కలు అందుబాటులో లేకపోయినా 80 శాతం మొక్కలు మాత్రం ప్రతీ నర్సరీలో పెంచుతున్నారు. సర్పంచ్‌లు, ఉపాధిహామీ సిబ్బంది శ్రద్ధనుబట్టి స్థానికంగా మొక్కలు రకరకాలుగా పెంచుతున్నారు.
అన్ని గ్రామ పంచాయతీల్లో నర్సరీల ఏర్పాటుతో స్థానికంగానే మొక్కలు దొరకడంతో ఇబ్బందులు లేకుండా పోయాయి. ప్రతీ నర్సరీలో 10వేల మొక్కలు నాటే లక్ష్యంతో నర్సరీలు ఏర్పాటు చేశాం. గతంలో హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. నాటిన ప్రతీ మొక్కను బతికించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
– రావెళ్ల శ్రీదేవి, ఏపీవో ఖమ్మం రూరల్
ఇంటికి ఆరు మొక్కలు ఇవ్వాలనే లక్ష్యంతో గ్రామాల్లో డిమాండ్ సర్వే కూడా పూర్తయింది. నర్సరీల నిర్వహణకు వన సేవకులను వియోగించుకుంటున్నాం. వారికి రోజు కు రూ.257 చొప్పున నెలలో 24 రోజుల వేతనం చెల్లిస్తున్నాం. కొత్త గ్రామ పంచాయతీల్లో నర్సరీల ఏర్పాటు కొంత ఇబ్బంది అనిపించినా.. ప్రస్తుతం వాటి నిర్వహణ సులభతరమైంది.
-చంద్రశేఖర్, ఎంపీడీవో, సింగరేణి
నర్సరీల నిర్వహణ బాధ్యత పూర్తిగా పంచాయతీలదే. మొక్కలను వానాకాలం నాటికి హరిహారానికి సిద్ధం చేయాలి. జిల్లాలోని ప్రతీ పంచాయతీ పరిధిలో 10వేల మొక్కలు నాటే విధంగా నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నాం. గత సంవత్సరం నర్సరీల్లో మిగిలిన మొక్కలను ఈసారి నాటుతాం. ప్రభుత్వ స్థలాలు, కాలువ గట్లపై రెండు వరుసల మొక్కలు వేశాం.
– విద్యాచందన, డీఆర్డీఓ
పల్లెల్లో ఏర్పాటు చేసిన నర్సరీలతో హరితహారం కార్యక్రమం నడుస్తున్నది. ఇది మంచి కార్యక్రమం. మొక్కలను ఇంటింటికీ నేరుగా పంచే కార్యక్రమం చేపట్టాం. నేలకొండపల్లి మేజర్ పంచాయతీలో హరితహారంలో అన్ని రకాల మొక్కలు నాటాం. ప్రభుత్వ స్థలాలు, రహదారుల వెంట మొక్కలు నాటాం. ఇప్పుడు కూడా నర్సరీని సమర్థంగా నిర్వహిస్తున్నాం.
-రాయపుడి నవీన్, నేలకొండపల్లి సర్పంచ్
గత సంవత్సరం జిల్లాలో సుమారు కోటి మొక్కలను పెంచారు. వాటిలో 2021-22 సంవత్సరానికి లక్ష్యం పూర్తి కావటంతో మిగిలిన వాటిని ఈ ఏడాది వాడుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎవెన్యూ ప్లాంటేషన్‌కు సంబంధించిన వేప, చింత మొక్కలు సుమారు 17లక్షలను చిన్న బ్యాగుల నుంచి పెద్ద బ్యాగుల్లోకి మార్చి వాటిని ఈ సంవత్సరం ఎవెన్యూ ప్లాంటేషన్‌కు వాడనున్నారు. ఇళ్లలో పెంచుకునే సుమారు 29లక్షల మొక్కలను ఈ సంవత్సరం వాడుతున్నారు.
ఒక్కో బాక్సులో ఎనిమిది ఫ్రేములు ఏర్పాటు చేశాడు మురళి. వాటిల్లోకి సుమారు 50 వేల నుంచి లక్ష ఈగల వరకూ చేరాయి. సుమారు 30 శాతం మగ ఈగలు లోపలే ఉంటూ రక్షణ కల్పిస్తుండగా మిగిలిన ఆడ ఈగలు బయటకు వెళ్లి మకరందాన్ని సేకరిస్తాయి. ఈగలు మకరందం తెచ్చిన కొత్తలో పారిపోకుండా రెండు మూడు రోజులు బాక్సులోనే ఉంచి ప్రత్యేకమైన షుగర్ సిరప్ ఇస్తారు. రోజూ కొన్నిటిని వదులుతూ వారం రోజుల్లో ఆ ప్రాంతానికి అలవాటు చేస్తారు. ఒకసారి అలవాటైతే బయటకు వచ్చినా అవి తిరిగి మళ్లీ అదే బాక్సులోకి వస్తాయి. పూలు అధికంగా ఉంటే 15 రోజులకే తెనె వస్తుంది. కానీ ప్రస్తుతం 45 రోజులకోసారి బాక్సుకు సుమారు కేజీ నుంచి కేజిన్నర తేనె వస్తోంది. తేనె బాగా రావాలంటే పూలు ఎక్కువగా ఉండాలి. కేవలం పూల మొక్కల నుంచే కాకుండా పండ్ల మొక్కల పూల నుంచి కూడా తేనెటీగలు మకరందాన్ని సేకరిస్తాయి. ఇందుకోసం అతడు జామ తోటలో కూరగాయలు, ఇతర పండ్ల మొక్కలను అంతర పంటగా సాగు చేస్తున్నాడు. వాటిని కూడా సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నాడు. రసాయన ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేసిన పూల నుంచి తేనె సేకరిస్తే ఈగ చనిపోతుంది. కాబట్టి సేంద్రియ పద్ధతినే పాటించాలి. సాధారణంగా తేనెటీగలు రెండు నుంచి మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. కానీ పరిసర ప్రాంతాల్లోనే పూలు ఎక్కువగా ఉంటే దూరం వెళ్లకుండా స్థానికంగానే సేకరిస్తాయి. ఎక్కువ పూల కోసం ఫెన్సింగ్‌కు కాకర, బీర, దోస తీగలు పాకిస్తున్నాడు.
2017-18 10,07,793
2018-19 12,03,666
2019-20 21,08,734
2020-21 22,52,214
2021-22 32,93,700
2022-23 48,80,000 (ప్రస్తుత సంవత్సరం)