మధిర, ఏప్రిల్ 19 : దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఈ ఫలితాల్లో మధిరకు చెందిన పాగి శశాంక్ ర్యాంక్ సాధించాడు. జాతీయస్థాయిలో ఎస్సీ క్యాటగిరి విభాగంలో 8,415 ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా శశాంక్‌ను తల్లిదండ్రులు, స్థానికులు అభినందించారు.