బోనకల్లు, నవంబర్ 3: ప్రజలకు, కార్యకర్తలకు అందరికి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ వెన్నంటే ఉంటుందని మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజు అన్నారు. బోనకల్లు గిరిజనకాలనీలోని 10 కుటుంబాల వారు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి లింగాల కమల్‌రాజు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించి మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు కష్టపడి పనిచేసి ప్రజల్లో పార్టీపై నమ్మకం పెంచాలన్నారు. కార్యక్రమంలో బంధం శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లికార్జునరావు, వేమూరి ప్రసాద్, బానోత్ కొండ, చావా వెంకటేశ్వరరావు, నరసింహారావు, పోటు వెంకటేశ్వర్లు, తేళ్లూరి రమేశ్, బానోత్ రాజు, మందా హైమావతి, అంతోటి జమలమ్మ, భూక్యా సైదా, గుగులోతు శ్రీను తదితరులు పాల్గొన్నారు.
చింతకాని, నవంబర్ 3 : నిరుపేదలకు అండగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారని, గ్రామాల్లో దళితబంధు అమలుతో దళితుల జీవితాల్లో ఊహించని మార్పులు వచ్చాయని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. రామకృష్ణాపురంలో కురుగుంట్ల రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకు చెందిన 5 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు కురుగుంట్ల రవీందర్‌రెడ్డి, కన్నెబోయిన కుటుంబరావు, పర్చగాని తిరుపతి కిషోర్, కోపూరి పూర్ణయ్య, పెంట్యాల పుల్లయ్య, మంకెన రమేశ్, గురజాల హనుమంతరావు, పిన్నెల్లి శ్రీనివాస్, శెట్టి సురేశ్, సకినాల అంజయ్య, వీరబాబు, యాదగిరి, నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, హనుమంతరావు, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
చింతకాని, నవంబర్ 3 : మధిర నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు, నాయకులకు, అధికారులకు అందుబాటులో ఉండే జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్‌ను గెలిపించాలని బీఆర్ఎస్ మండల కార్యదర్శి బొడ్డు వెంకట్రామారావు అన్నారు. బస్వాపురం గ్రామంలో బూత్, గ్రామ కమిటీ, వారితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి మాట్లాడారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఇంటింటి ప్రచారం చేశారు. కారు గుర్తుపై ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచార కార్యక్రమాల్లో బీఆర్ఎస్ మండల, గ్రామ శాఖ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్ కన్వీనర్లు, కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మధిర, నవంబర్3: మధిర అసెంబ్లీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రచార వాహనాలను ఏర్పాటు చేశారు. ఈ వాహనాల అనుమతుల కోసం మధిర అసెంబ్లీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి జీ.గణేశ్‌ను కోరారు. బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం, చింతకాని, ముదిగొండ మండలాల్లో ఈ వాహనాల ద్వారా ప్రచారం చేపట్టేందుకు నియోజకవర్గ పార్టీ నిర్వాహకులు బాధ్యతలు అప్పగించారు.
ఎర్రుపాలెం, నవంబర్ 3: నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి జడ్పీచైర్మన్ లింగాల కమల్‌రాజు గెలుపు కోరుతూ గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు ఇంటింటి తిరిగి డోర్పోస్టర్లను అంటిస్తూ ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు చావా రామకృష్ణ, పంబి సాంబశివరావు, దేవరకొండ శిరీష, శీలం కవిత, మొగిలి అప్పారావు, బాలరాఘవరెడ్డి, శ్రీనివాసరెడ్డి, కొండేపాటి సాంబశివరావు, రామకోటయ్య, శిరీష, కృష్ణారావు, కిశోర్‌బాబు, రవి, భాస్కర్, చిరంజీవి, సుదీర్, ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ముదిగొండ, నవంబర్ 3 : మధిర బీఆర్ఎస్ అభ్యర్థి లింగాల కమల్‌రాజ్ గెలుపును కాంక్షిస్తూ ముదిగొండలో శుక్రవారం జోరుగా ప్రచారం నిర్వహించారు. గ్రామంలోని లక్ష్మీనర్సింహ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు వివరించారు. కార్యక్రమంలో నాయకులు మందరపు ఎర్ర వెంకన్న లక్ష్మీ, తోట ధర్మారావు, తేరాల రామారావు, షేక్ కాజా, రొంపిచర్ల సత్యవాణి, రాణి, సుధారాణి, మల్లారపు సురేశ్, కొమ్మూరి స్వాతి, రమేశ్, యుగంధర్, మల్లెల నాగయ్య, మల్లయ్య, ఉన్నం రవి, కనకయ్య, దోమల పుల్లయ్య, షేక్ మైబూ, రామారావు, నాగేశ్వరరావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.