Humanity | మధిర : ఉన్నత స్థాయిలో ఉన్న వారు కనీసం ఆపదలో ఉన్న వారికి ఆసరాగా నిలవకపోయినా కనీసం కన్నెత్తి చూడడానికి కూడా ఇష్టపడని ఈ రోజుల్లో కడు పేదరాలు కాయ కష్టం చేసుకుని వచ్చిన డబ్బులతో తన జీవితాన్ని సాగిస్తూ తనకు లేకపోయినా మరొకరికి సహాయం చేయాలన్న ఆలోచన రావటమే ఆమె గొప్పతనానికి నిదర్శనంగా మిగిలింది.
వివరాల్లోకెళ్తే… మధిర పట్టణంలోని పేదరాలైనటువంటి బోయిన ఆదెమ్మ (Aademma)కు కనీసం ఉండడానికి ఇల్లు లేక ఓ గుడిసెలో నివాసముంటుంది. పట్నంలోని కొన్ని ఇళ్లల్లో పనులు చేసుకుంటూ.. పని చేయగా వచ్చిన డబ్బులతో వృద్ధురాలైన తన తల్లిని చూసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయినప్పటికీ తను నివాస ఉంటున్న ప్రాంతంలో అనాధ వృద్దులాశ్రమంలో ఉన్న వృద్ధులను, పిల్లలను చూసి చలించిపోయింది.
తను తినటానికి తిండి లేక ఇల్లు లేకపోయినా ఆమె ఆదరణ సేవా పౌండేషన్లో ఉన్న వృద్ధుల కోసం తను దాచుకున్న డబ్బులతో 25 కిలోల బియ్యం బ్యాగుని కిరాణా షాపులో కొనుక్కొని వచ్చి ఆదరణ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు నిస్సికి బియ్యం అందజేసి ఆమె గొప్ప మానవత్వాన్ని (Humanity) చాటుకుంది. ఈ సందర్భంగా ఆదెమ్మ దాన గుణాన్ని చూసి ఆశ్చర్యానికి గురై ఆమెను మనసారా అభినందించారు.
CM Revanth Reddy | బీసీలను మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి : ఎంఎం గౌడ్
Congress | కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని రచ్చబండపై నిరాహారదీక్షకు దిగిన యువకుడు