చింతకాని: పల్లెల్లో నిత్యం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తూ సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అరికట్టాలని జిల్లావ్యవసాయశాఖ ఏడీ సతీష్ అన్నారు. శుక్రవారంఆయన మండలంలోని జగన్నాథపురం గ్రామంలో ప్రైడే-డ్రైడే కార్యక్రమాల్లో భాగంగా పారిశుధ్య పనులను పరిశీలించిన ఆయన పనుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా స్థానిక అధికారులు పనితీరును మెరుగుపరచుకోవాలని, పల్లెప్రగతి పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని, గ్రామాల అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిఒక్కరినీ భాగస్వాములను చేసి గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించుకునేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు.
పరిసరాల పరిశుభ్రత విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారుల అలసత్వాన్ని సహించనని, రోడ్ల వెంట నీటి నిల్వలు, పిచ్చిమొక్కలు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆలస్యం నాగయ్య, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, ఎంపీడీవో బీ రవికుమార్, కార్యదర్శి జే వినోద్, వార్డుసభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.