మధిర, ఫిబ్రవరి 9 : దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళిత కుటుంబాలకు అండగా నిలిచించి కేసీఆర్యేనని మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని పలు వార్డుల్లో జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు, అభ్యర్థులు, పార్టీ శ్రేణులతో కలిసి సోమవారం నిర్వహించిన రోడ్ షోలో నామా పాల్గొన్నారు.
ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ మధిర పట్టణంలో నేడు కనిపిస్తున్న అభివృద్ధి అంతా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిందేనని గుర్తు చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. 11వ వార్డులో గద్దల శారమ్మ, 12వ వార్డులో గద్దల పాపరాణి, 22వ వార్డులో రెడపంగి ప్రసాద్ కారు గుర్తుపై, 16వ వార్డులో మల్లాది హన్మంతరావు విజిల్ గుర్తుపై, 17వ వార్డు అంగడాల పార్వతి కారు, 18వ వార్డు పంతంగి నాగయ్య సుత్తీకొడవలి నక్షత్రం, 20వ వార్డులో రామాల కవిత, 21వ వార్డులో పరిశ నాగలక్ష్మి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.
జడ్పీ మాజీ చైర్మన్ కమల్ రాజు మాట్లాడుతూ ఎన్నికల్లో లబ్ధి కోసమే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార శంకుస్థాపనలు, నిధుల మంజూరు అంటూ హడావుడి చేస్తున్నారని, ఇది ముమ్మాటికీ ప్రజలను వంచించడమే అవుతుందన్నారు. మార్కెట్ మాజీ చైర్మన్ చిత్తూరు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు కనుమూరు వెంకటేశ్వరరావు, అరిక శ్రీనివాసరావు, రూరల్ మండల అధ్యక్ష, కార్యదర్శులు రావూరి శ్రీనివాసరావు, బొగ్గుల భాసర్రెడ్డి, నాయకులు చావా వేణు, బికి కృష్ణప్రసాద్, మంతెన రమేశ్, గురజాల హన్మంతరావు, బొడ్డు వెంకటరామారావు, పొనుగోటి రత్నాకర్, బంధం నాగేశ్వరరావు, బెజవాడ మల్లికార్జునరావు, కోన నరేందర్, అబ్బూరి రావన్, తాల్లూరి హరీశ్ పాల్గొన్నారు.