మధిర : కొత్తగూడెంలో సీనియర్ న్యాయవాది జలసూత్రం శివరాంప్రసాద్పై ఆరాచకశక్తులు దాడిని ఖండిస్తూ మధిర బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం మధిర కోర్టులో న్యాయవాదులు విధులు బహిష్కరించి, కోర్టు ముందు నిరసన వ్యక్తం చేశారు. ఇలాంటి దాడులను ప్రతిఒక్కరూ తీవ్రంగా ఖండించాలని న్యాయవాదులు అన్నారు. ఈ కార్యక్రమంలో మధిర బార్అసోసియేషన్ అధ్యక్షుడు భైరవభట్ల శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాదులు వాసంశెట్టి కోటేశ్వరరావు, సీ. గోపాల్, నంబూరి జనార్ధన్‌రావు, చావలి రామరాజు, టీ.వెంకట్రావు, జే.రమేష్, నెల్లూరి రవి, ఎం.సతీష్, కే.విజయ్‌కుమార్, బీ.పుల్లారావు, పుట్టా శ్రీనివాసరావు, కోట జ్ఞానేష్ తదితరులు పాల్గొన్నారు.