ఇల్లెందు, అక్టోబర్ 16: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ విజయవంతానికి అన్ని వర్గాల ప్రజలూ సహకరించాలని బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడు, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్ కోరారు. ఇల్లెందు జగదాంబ సెంటర్లోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల ఆయన మాట్లాడారు.
రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుచేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ శ్రేణులు కూడా బంద్‌లో పాల్గొననున్నట్లు చెప్పారు. ఈ బంద్‌కు వ్యాపార సముదాయాలు, వాణిజ్య కేంద్రాలు, విద్యాసంస్థలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు అబ్దుల్ నబీ, ఎస్.రంగనాథ్, ఎండీ జబ్బార్,యలమందల వాసు, ఎర్రబెల్లి కృష్ణయ్య, రాజేశ్, లలిత్‌కుమార్ పాసి, ఉపేందర్, వసంతరావు, రవి, రామ్‌లాల్ పాసి, బజారు సత్యనారాయణ, డేరంగుల పోషం, పాలడుగు రాజశేఖర్, సర్దార్, ఇమ్రాన్ కిషన్ పాసి, మదార్బీ, సత్యవతి పాల్గొన్నారు.