సత్తుపల్లి, జూన్ 14 : రక్తదానంతో ఆపదలో ఉన్న వారిని కాపాడవచ్చని, రక్తదానం మరొకరికి ప్రాణదానమని ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో సీతారాం అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవం సందర్భంగా వైద్యులతో కలిసి మంగళవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. తలసేమియా వ్యాధితో అనేక మంది చిన్నారులు బాధపడుతున్నారని వారిని కాపాడేందుకు యువకులు, విద్యార్థులు రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ కె.వెంకటేశ్వర్లు, ఎల్.భాస్కర్‌నాయక్, వైద్యులు చింతా కిరణ్, శివకృష్ణ, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
పెనుబల్లి, జూన్ 14 : అన్ని దానాల్లో కెల్లా రక్తదానం మహా గొప్పదని వైద్యాధికారి శాంతారాణి అన్నారు. జాతీయ రక్తదానం దినోత్సవం సందర్భంగా పీహెచ్సీలో రక్తదానంపై మంగళవారం అవగాహన కల్పించారు. ప్రతి మనిషి రక్తదానం చేయడం అవసరమని, ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మందడపు అశోక్‌కుమార్, హెచ్ఎం ప్రకాశ్‌రావు, నాగేశ్వరరావు, పొట్టెమ్మ, హెల్త్ అసిస్టెంట్ కరీముల్లా, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.