సత్తుపల్లి టౌన్, మార్చి 17 : తెలంగాణ రాష్ట్రం సంక్షేమానికి చిరునామాగా మారిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లు, ఐకేపీ సిబ్బంది, మెప్మా, ఔట్సోర్సింగ్, వీఆర్ఏలతో కలిసి గురువారం ఆయన సీఎం కేసీఆర్, ఐటీ, పురపాలక శాఖమంత్రి కేటీఆర్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఎర్రబెల్లి దయాకర్‌రావు చిత్రపటాలకు పుష్పాభిషేకం, క్షీరాభిషేకం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేశ్, ఎంపీపీలు దొడ్డా హైమావతీశంకర్రావు, పగుట్ల వెంకటేశ్వరరావు, బీరవెల్లి రఘు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు రఫీ, అంకంరాజు, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుళ్ల కృష్ణయ్య, పెనుబల్లి, సత్తుపల్లి మండల అధ్యక్షులు కనగాల వెంకటరావు, యాగంటి శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ సుజాత, మెప్మా రిసోర్స్ పర్సన్ సుజాత, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
పెనుబల్లి, మార్చి 17 : పెనుబల్లి మండలంలో పలు శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు గురువారం ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమక్షంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పూలు, పాలతో అభిషేకం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ప్రకటనతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. అనంతరం పంచాయతీ కంప్యూటర్ ఆపరేటర్లు, సెర్ప్ ఉద్యోగులు, గుమాస్తాలు, పారిశుధ్య కార్మికులు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఎమ్మెల్యే సండ్రను సత్కరించారు.
పెనుబల్లి, మార్చి 17 : సీఎం కేసీఆరే దివ్యాంగులకు అండ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. దివ్యాంగులకు రాయితీపై అందించే బస్‌పాస్‌లను గురువారం పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్కినేని అలేఖ్య, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకటరావు, ఏఎంసీ చైర్మన్ చెక్కిలాల లక్ష్మణ్‌రావు, భూక్యా ప్రసాద్, సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు అశోక్‌కుమార్, ఆర్టీసీ ఆర్ఎం సాల్మన్, సత్తుపల్లి డిపో మేనేజర్ శ్రీహర్ష, ఎంపీడీవో కావూరి మహాలక్ష్మి, తహసీల్దార్ రమాదేవి, సర్పంచ్‌లు తేజావత్ తావూనాయక్, భూక్యా పంతులి, ఎంపీటీసీలు చీపి లక్ష్మీకాంతం, కనగాల సురేశ్‌బాబు, భూక్యా ప్రసాద్ ఎస్కే గౌస్ తదితరులు పాల్గొన్నారు.
వైరా, మార్చి17 : సీఎం కేసీఆర్ చిత్రపటానికి వైరాలో ఎమ్మెల్సీ తాతా మధు సమక్షంలో ఫీల్డ్అసిస్టెంట్లు గురువారం క్షీరాభిషేకం చేశారు. ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ వైస్‌చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, వైరా మార్కెట్ కమిటీ చైర్మన్ బీ డీ కే రత్నం, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు షేక్ లాల్‌మహ్మద్, ఎంపీటీసీలు రాయల రమేశ్, బూరుగు సంజీవరావు, శీలం వెంకట్రామిరెడ్డి, యరమల సౌజన్య, అల్లిక కాటంరాజు, మట్టూరి కృష్ణారావు, షేక్ లాల్‌మహ్మద్, ఎంపీటీసీలు రాయల రమేశ్, బూరుగు సంజీవరావు, శీలం వెంకట్రామిరెడ్డి, యరమల సౌజన్య, అల్లిక కాటంరాజు, సర్పంచ్‌లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.