ఖమ్మం, జూన్ 13: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆ పార్టీ ఖమ్మం జిల్లా నేతలు శుక్రవారం హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్‌ను కలిసిన వారిలో ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, పాలేరు నియోజకవర్గ నేతలు ఉన్నం బ్రహ్మయ్య, బెల్లం వేణు, బాసబోయిన వీరన్న తదితరులు ఉన్నారు.
అలాగే, ప్రమాదవశాత్తూ ఇటీవల జారిపడి సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఈ నేతలు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.