పోటెత్తిన మిర్చి బస్తాలు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఖమ్మం సహా పొరుగు జిల్లాల రైతులు సుమారు 60 వేల బస్తాలను బుధవారం తెల్లవారుజామునే మిర్చియార్డుకు తీసుకొచ్చారు.
- ఖమ్మం ఏఎంసీకి ఒకే రోజు 60 వేల మిర్చి బస్తాలు
- జెండాపాటలో క్వింటాకు రూ.22,300 పలికిన ధర
- రెండు రోజుల వ్యవధిలో రూ.800 పెరుగుదల
ఖమ్మం వ్యవసాయం, ఫిబ్రవరి 7: ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు బుధవారం మిర్చి బస్తాలు పోటెత్తాయి. ఖమ్మం సహా పొరుగు జిల్లాల రైతులు సుమారు 60 వేల బస్తాలను బుధవారం తెల్లవారుజామునే మిర్చియార్డుకు తీసుకొచ్చారు. దీంతో ఈ ఏడాది రికార్డు స్థాయిలో మిర్చి వస్తాలు వచ్చినట్లయింది. మిర్చి బస్తాలు పెద్ద మొత్తంలో తెచ్చిన వారిలో ఖమ్మంతోపాటు సూర్యాపేట, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఏపీలోని కృష్ణా జిల్లాల రైతులు ఎక్కువమంది ఉన్నారు. ఇటీవలి వరుస సెలవుల తరువాత తిరిగి మార్కెట్లో క్రయవిక్రయాలు కొనసాగుతుండడం, మరో నాలుగు రోజుల పాటు మార్కెట్కు సెలవులు రావడం వంటి కారణాలతో రైతులు తమ పంటను భారీగా తేవడానికి కారణంగా ఉంది. ఉదయం జెండాపాట సమయానికే సుమారుగా 60 వేల బస్తాలు వచ్చాయి. దీంతో మిర్చియార్డంతా ఎర్రబంగారం బస్తాలతో కిక్కిరిసింది.
అనంతరం జరిగిన జెండాపాటలో గరిష్ఠ ధర క్వింటాకు రూ.22,300 పలికింది. అదే విధంగా మధ్య ధర రూ.20 వేలు, కనిష్ఠ ధర రూ.14 వేలు పలికింది. అదే విధంగా తాలు రకం పంటకు క్వింటాకు గరిష్ఠ ధర క్వింటాకు రూ.12 వేలు, మధ్య ధర రూ.11 వేలు, కనిష్ఠ ధర రూ.9 వేల చొప్పున పలికాయి. రెండు రోజుల క్రితం ఇదే మార్కెట్లో మిర్చికి క్వింటాకు రూ.21,500 ధర పలుకగా రెండు రోజుల్లోనే మరో రూ.800 ధర పెరిగింది. దీంతో రూ.22 వేల మార్క్ దాటింది. యార్డుకు భారీగా మిర్చి బస్తాలు వచ్చినప్పటికీ కార్మికులు, ట్రాలీ కార్మికులు తమ పనులు వేగవంతం చేయడంతో సాయంత్రంలోగా కాంటాలు, తోలకాల ప్రక్రియ పూర్తయింది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

