పినపాక, ఏప్రిల్ 11 : తెలంగాణ రాష్ర్టానికి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కానున్నారని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. మంగళవారం పినపాక మండల సరిహద్దులోని రాళ్లవాగు పెద్దమ్మ గుడి సమీపంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా ప్రజా సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ తెలంగాణలో గొప్పగా అమలు చేస్తున్నారని, మన పథకాలను యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. మన పథకాలను దేశం మొత్తం అందించాలనే సదుద్దేశంతో కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని పేర్కొన్నారు. ఎన్నికల సమయం ఆసన్నమవుతుందని ప్రజలు పనిచేసే వాడిని ఎన్నుకోవాలా, పనికిమాలిన వాడిని ఎన్నుకోవాలా అనేది ఆలోచించుకోవాలని సూచించారు.
సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని, సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. పినపాక నియోజకవర్గంలో ఈ నాలుగున్నర ఏండ్లలో చేసిన అభివృద్ధి ఏ ఎమ్మెల్యే చేయలేదన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పట్టనున్నారని, ప్రతిపక్షాలకు వచ్చే ఎన్నికల్లో భంగపాటు తప్పదన్నారు. పార్టీ ప్రతిష్ఠను పెం చేందుకు కార్యకర్తలు నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్లో కోవర్టు రాజకీయాలకు స్థానం లేదని అటువంటి వారు పార్టీని వదిలివెళ్లాలని సూచించారు. 12 గ్రామ పంచాయతీల నుంచి సుమారు 3వేల మంది తరలిరాగా సర్పంచ్, గ్రామ కమిటీ అధ్యక్షుడిని అడిగి సమస్యలను రేగా నోట్ చేసుకున్నారు. రేగాను మహిళలు, కార్యకర్తలు, బతుకమ్మలు, కోలాట నృత్యాలు, కొమ్ము నృత్యాలతో ఘనస్వాగతం పలికారు.
సిద్దెల హుస్సేన్ కళాబృందం వారి పాటలు, డ్యాన్స్‌లు అలరించాయి. కార్యకర్తలతో కలిసి రేగా చిందేసి ఉత్సాహపర్చారు. సమ్మేళనానికి వచ్చినవారందరికీ భోజనం ఏర్పాటు చేశారు. ఈబయ్యారం సీఐ బూర రాజగోపాల్ ఆధ్వర్యంలో ఈబయ్యారం, కరకగూడెం ఎస్సైలు స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీశ్‌రెడ్డి, ఎంపీపీ గుమ్మడి గాంధీ, జడ్పీటీసీ సుభద్రాదేవి, వాసుబాబు, మణుగూరు జడ్పీటీసీ పోశం నర్సింహారావు, పీఏసీఎస్ చైర్మన్ వర్మ, ఆత్మ చైర్మన్ భద్రయ్య, వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవానిశంకర్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ దొడ్డా శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బొలిశెట్టి నర్సింహారావు, అక్కిరెడ్డి సంజీవరెడ్డి, మొగిలిపల్లి నర్సింహారావు, చింతపంటి సత్యం, కొండేరు రాము, బుల్లిబాబు, పొలిశెట్టి సత్తిబాబు, యూసుఫ్, కుర్రి నాగేశ్వరరావు, యాదగిరిగౌడ్, అడప అప్పారావు, రావుల సోమయ్య తదితరులు పాల్గొన్నారు.