మధిర, ఏప్రిల్ 12 : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ అలుపెరుగని పోరాటం చేశారని, ముఖ్యమంత్రిగా పదేళ్లు అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. వరంగల్‌లో ఈ నెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు సిరిపురం గ్రామంలో వాల్ రైటింగ్ చేస్తూ శనివారం విస్తృతంగా ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా కమల్‌రాజు బ్రష్ పట్టి కేసీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు రాశారు. అనంతరం మాట్లాడుతూ కేసీఆర్ ప్రాణాలకు తెగించి పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లపాటు ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించారని, రైతులు, నిరుపేదల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి పకడ్బందీగా అమలు చేశారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే రజతోత్సవాలకు ఊరూరు నుంచి బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో నాయకులు బొగ్గుల భాసర్‌రెడ్డి, చావా వేణు, చిత్తారు నాగేశ్వరరావు, వంకాయలపాటి నాగేశ్వరరావు, కనకపుడి బుచ్చయ్య, కోన నరేందర్‌రెడ్డి, గుర్రాల పెద్ద సైదిరెడ్డి, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంబూరు శ్రీనివాస్‌రావు, పల్లపాటి కోటేశ్వరరావు, ఆళ్ల నాగబాబు, పరిశ శ్రీనివాసరావు, రామాల ముకోటి, చారి, పెయింటర్ భాసర్, కనకపొడి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.