భద్రాచలం, అక్టోబర్ 17 : గిరిజనుల హక్కుల సాధన కోసం జల్ జంగిల్ జమీన్ నినాదంతో నిజాం సర్కార్‌తో పోరాడి అసువులుబాసిన విప్లవయోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రంభీం అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ అన్నారు. ఐటీడీఏ సమావేశ మందిరంలో గిరిజనుల ముద్దుబిడ్డ కుమ్రంభీం 84వ వర్ధంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పీవో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ అడవి బిడ్డల హక్కుల సాధన కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు కుమ్రం భీం అని కొనియాడారు.
ఆదికవి వాల్మీకి జయంతి వేడుకలను ఐటీడీఏ సమావేశ మందిరంలో పీవో రాహుల్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పీవో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి రాముడు నడయాడిన ప్రదేశంలో పనిచేస్తున్న మనం.. ఆయన చరిత్రను రామాయణంగా మలిచిన వాల్మీకి జయంతిని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు.
కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవో డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ, ఏవో రాంబాబు, ఉద్యానవన అధికారి ఉదయ్‌కుమార్, అగ్రికల్చర్ ఏడీ భాస్కర్, ఆర్సీవో గురుకులం నాగార్జునరావు, ఎస్డీసీ రవీంద్రనాథ్, డీటీఆర్వోఎఫ్ఆర్ లక్ష్మీనారాయణ, పీవీజీటీ అధికారి మణిధర్, ఏసీఎంవో రమణయ్య, జీసీడీవో అలివేలు, మంగతాయారు, డీఎస్వో ప్రభాకర్‌రావు, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.