మధిర రూరల్, మార్చి 23: మధిర మండలంలోని ఆతూరు గ్రామం వద్ద ఉన్న సాయిబాలాజీ కోల్డ్స్టోరేజ్లో విద్యుదాఘాతంతో జరిగిన ప్రమాదం రైతుల కష్టానంతా అగ్గిపాలు చేసింది. కోల్డ్స్టోరేజ్లో నిల్వ ఉంచిన 28వేల మిర్చి బస్తాలు కాలి బూడిదయ్యాయి.
మూడోరోజు సోమవారం సైతం ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. కలెక్టర్ అనుదీప్ ఆదేశాల మేరకు మధిర తహసీల్దార్ కార్యాలయంలో బాధిత రైతుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. 350మంది బాధితులకు గాను 291మంది రైతులు ఇన్సూరెన్స్ కోసం ఈ కౌంటర్లో తమ రసీదు జిరాక్స్ ప్రతులు ఇచ్చి పేరు నమోదు చేసుకున్నట్లు తహసీల్దార్ రాంబాబు తెలిపారు.