కల్లూరు: కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హిందీ సబ్జెక్టు బోధించేందుకు అర్హులైన అభ్యర్ధుల నుంచి గెస్ట్ లెక్చరర్ పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాసరావు గురువారం తెలిపారు. అర్హులైన అభ్యర్ధులు దరఖాస్తులను ఈనెల 24వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు కళాశాలలో సమర్పించాలని ఆయన కోరారు.