కూసుమంచి రూరల్/ చింతకాని, మార్చి 8: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయని అఖిల భారత సర్వీస్ శిక్షణ అధికారులు రజిత్మిశ్రా, కార్తికేయన్, సత్యరాజ్, రావల్ కృషికేష్ పేర్కొన్నారు. నాలుగు రోజుల శిక్షణలో భాగంగా వారు మంగళవారం కూసుమంచి మండలం గైగొళ్లపల్లిలో మండల పరిషత్ పాఠశాలను, అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థులతో మాట్లాడి వారి ప్రతిభను పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ పిల్లలతో కలిసి భోజనం చేశారు. ఎంపీడీవో కరుణాకర్‌రెడ్డి, సర్పంచ్ ముల్కూరి శ్యామ్‌సుందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు బాగున్నాయని, పల్లెల్లో స్థానిక సంస్థల ప్రగతి ఎంతో బాగుందని ట్రైనీ కలెక్టర్లు ఆర్చి వీరేంద్ర, శ్రీ సురభ్గుప్తా, ఆదిత్య మిశ్రా, పుష్కిన్ జైన్ పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలో మంగళవారం వారు పర్యటించారు. గ్రామస్థాయి అభివృద్ధి, పాలన, సంక్షేమం వంటి అంశాలను పరిశీలించారు. సర్పంచ్ నూతలపాటి మంగతాయారమ్మ, ఎంపీడీవో రవికుమార్, ఎంపీవో మల్లెల రవీంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.