దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌దే ముఖ్య భూమిక
దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ముఖ్య భూమిక పోషించబోతున్నారని, రానున్న కాలంలో సీఎం కేసీఆర్ ప్రధాని అవుతారని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు. గురువారం పండితాపురంలోని శ్రీ శ్రీనివాస ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే మోడల్‌గా నిలిచాయన్నారు.
- తెలంగాణ పథకాలు దేశానికే మడల్
- ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ఇంటింటికీ వివరించాలి
- తెలంగాణ గడ్డపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ఆటలు సాగవు
- ఆత్మీయ సమ్మేళనంలో ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్
కామేపల్లి, మే 18 : దేశ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ ముఖ్య భూమిక పోషించబోతున్నారని, రానున్న కాలంలో సీఎం కేసీఆర్ ప్రధాని అవుతారని ఇల్లెందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియానాయక్ పేర్కొన్నారు. గురువారం పండితాపురంలోని శ్రీ శ్రీనివాస ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే మోడల్‌గా నిలిచాయన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచి సంక్షేమ పథకాల రూపంలో పేదలకు పంచుతున్నారని, రైతుల సంక్షేమం కోసం పలు రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేయడంతో వ్యవసాయాన్ని పండుగలా చేసుకుంటున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలను అమలు చేసేందుకే సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చారన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా అభివృద్ధికి బాటలు వేయలేదని, రాష్ర్టాలపై పెత్తనం చెలాయించేందుకు తాపత్రయ పడుతున్నదని, తెలంగాణ గడ్డపై బీజేపీ, కాంగ్రెస్ ఆటలు సాగవని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ.. మన ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఇంటింటికీ విస్తృతంగా వివరించాలని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయని, సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయమన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఈ ప్రాంత ప్రజలకు మరోసారి సేవ చేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.
అభివృద్ధిలో ముందున్నాం..: డీసీసీబీ చైర్మన్
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందున్నదని, ప్రజల అవసరాలను గుర్తించి వాటి పరిష్కారానికి శక్తివంచన లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ ఆహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతుల ఆశీస్సులు నిండుగా ఉన్నాయని, రైతులంతా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ముందుగా పండితాపురం గ్రామ బీఆర్ఎస్ ఆధ్వర్వంలో భారీ మోటర్ సైకిల్ ర్యాలీ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ధనియాకుల హనుమంతరావు, ఎంపీపీ బానోత్ సునీత, కామేపల్లి పీఏసీఎస్ చైర్మన్ తీర్థాల చిదంబరరావు, రైతుబంధు సమితి మండల కన్వీనర్ ఆంతోటి అచ్చయ్య, కోటమైసమ్మతల్లి దేవాలయ కమిటీ చైర్మన్ మల్లెంపాటి శ్రీనివాసరావు, ప్రజాప్రతినిధులు, నాయకులు యలమద్ది అప్పారావు, మూడ్ కృష్ణప్రసాద్‌నాయక్, శ్రీను, కేలోత్ భాస్కర్‌నాయక్, వడియాల కృష్ణారెడ్డి, మూడ్ దుర్గాజ్యోతి, జాటోత్ జాయ్‌లూసీ, లకావత్ సునీత, బానోత్ రవి, లకావత్ భీమానాయక్, కొమ్మినేని శ్రీనివాసరావు, ధనియాకుల మాధవరావు, దండగల దేవేందర్, చల్లా హరి, నాగేంద్రబాబు, మాలోత్ సరిరాంనాయక్, కీసర విష్ణువర్థన్‌రెడ్డి, పుచ్చకాయల బాబు, కోటయ్య, బానోత్ రాములు, దొడ్డ మల్లేశ్, బానోత్ రాందాస్‌నాయక్, రాయల రాఘవయ్య, ఐతనబోయిన విఠల్‌రావు, నాగేశ్వరరావు, అర్వపల్లి జగదీష్, పవన్, మేకపోతుల సాయన్న, కొమ్మినేని నగేష్, అప్పారావు, ధనియాకుల నరసింహారావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

