Illegal Sand mining | గుండాల, ఫిబ్రవరి 13 : అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఈశాల సురేష్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు వాగబోయిన చంద్రయ్య దొర అధ్యక్షతన గుండాల మండల కేంద్రంలో ఇవాళ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గుండాల మండలంలో గల జీవనది అయిన కిన్నెర సాని వాగులో అక్రమ ఇసుక వ్యాపారాలు రాజ్యం ఏలుతుంటే, చట్టాలను అమలు చేయవలసిన మండల స్థాయి, జిల్లాస్థాయి అధికారులు, అదేవిధంగా ప్రశ్నించాల్సిన ఆదివాసి రాజకీయ నాయకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారని మండిపడ్డారు.
అధికారులు, రాజకీయ నాయకులు వారి పని కానట్టు, నిర్లక్ష్యం వహించడం వల్ల కొంతమంది గిరిజనేతర బడాబాబులు ఎటువంటి అనుమతులు లేకుండా ఏజెన్సీ ఆదివాసి చట్టాలను, వోల్టాచట్టం, గ్రౌండ్ వాటర్, మైనింగ్, ఎన్విరాన్మెంట్, పీసాచట్టం, 1/70 చట్టాలను తుంగలో తొక్కి ఆదివాసీలకు, ప్రభుత్వానికి చెందవలసిన కోట్ల రూపాయల విలువ గల ఇసుకను వ్యాపారం చేస్తుంటే,ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం, ప్రభుత్వ పరిపాలన ఉన్నట్టా? లేనట్టా? అని ప్రశ్నించారు.
ఆదివాసుల చట్టాలను హక్కులను కాపాడవలసిన అధికారులు స్థానిక రాజకీయ నాయకులే మైదాన ప్రాంత గిరిజనేతరులను ప్రోత్సహించిన వారు ఇచ్చే ముడుపుల కొరకు చట్టాలను లెక్క చేయక దోచిపెడుతున్న రాజకీయ నాయకులకు ఆదివాసి ప్రజలు బుద్ధి చెప్పాలని హితవు పలికారు. ఈ చట్టాలపైన అవగాహన కల్పించవలసిన పీసా కోఆర్డినేటర్ల చేత ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో గుండాల,ఆళ్లపల్లి, మణుగూరు, పినపాక చర్ల, దుమ్ముగూడెంలలో చైతన్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
పార్టీలకు ముప్పు తప్పదు..
ఇలాంటి అక్రమ వ్యాపారం సాగించే విధంగా గిరిజన నేతలను ప్రోత్సహిస్తున్న ప్రజాప్రతినిధులకు బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయన్నారు. దానిని గమనించి కొన్ని రాజకీయ పార్టీలు మసులుకోవాలని లేకపోతే ఈ ప్రాంతంలో వారి పార్టీలకు ముప్పు తప్పదని హెచ్చరించారు. ఆదివాసి చట్టాలను తుంగలో తొక్కి రాజకీయ నాయకుల బెదిరింపులకు తలొగ్గుతూ.. అర్ధరాత్రి రిస్క్ చేసి అక్రమ ఇసుక తరలిస్తున్న వారిని పట్టుకుని మండల ఆఫీసర్లకు అప్పచెప్పిన యువతను ప్రోత్సహించడం మాని, దొంగలకు కొమ్ము కాసి వారి పైన ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా ఎటువంటి యాక్షన్ లేకుండా వదిలి పెడుతున్న మండల స్థాయి అన్ని శాఖల అధికారుల పైన కలెక్టర్కు, పివోకు, కమిషనర్లకు పిర్యాదులు చేసి వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో తాటి వెంకటేశ్వర్లు రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కోశాధికారి సోలం రామారావు, గూండాల మండల అధ్యక్షులు పునెం రమనబాబు, మణుగూరు కార్యదర్శి కంగల ప్రవీణ్, టేకులపల్లి కార్యదర్శి కొరం సమ్మయ్య, గొగ్గెల సుధాకర్, జబ్బ సుదర్శన్, కొడేం రమేష్, వేణు, తదితరులు పాల్గొన్నారు.
Aadhaar | ఆధార్ కార్డుల కోసం రోడ్డెక్కిన మహిళ.. నలుగురు పిల్లలతో కలిసి జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట ధర్నా
Langar House | లంగర్ హౌస్లో ఫుట్ పాత్ ఆక్రమణల కూల్చివేత
Hyderabad | మూసీ పరిసరాల్లో మళ్లీ కూల్చివేతలు.. భయాందోళనలో జనం