దళితుల సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని, ‘దళితబంధు’ పథకం యావత్ దేశానికే ఆదర్శమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రఘునాథపాలెం మండ లంలోని ఈర్లపూడి గ్రామం ‘దళితబంధు’ పథకానికి ఎంపికైంది. శనివారం గ్రామంలో లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా లబ్ధిదారులతో కలిసి మంత్రి అజయ్ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొదటి విడతలో ఈ పథకం ద్వారా 100 మందికి లబ్ధి చేకూరనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులు ఆర్థికంగా ఎదగాలని, వ్యాపార యూనిట్లను నెలకొల్పి సక్సెస్ కావాలన్నారు. దళిత రక్షణ నిధి ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
రఘునాథపాలెం, మార్చి 5: దళితుల సాధికారతకు ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలోని ఈర్లపూడిలో శనివారం నిర్వహించిన దళితబంధు అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడంతోపాటు సామాజిక అసమానతలను రూపుమాపడానికి సీఎం కేసీఆర్ అద్భుతమైన ఆలోచన చేశారన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో ఏకైక మండలమైన రఘునాథపాలెంలోని ఈర్లపూడి గ్రామాన్ని దళితబంధు పథకానికి ఎంపిక చేశారన్నారు. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మొదటి విడతలో పైలట్ ప్రాజెక్టుగా 100 మందికి ఈ పథకం వర్తింపజేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ ముందు చూపుతో ఈపథకానికి రూపకల్పన చేశారన్నారు. దశల వారీగా రాష్ట్రంలోని అన్ని దళిత కుటుంబాలకు పథకం వర్తిస్తుందన్నారు. దళితులందరూ ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దీనినిఅమలు చేస్తున్నారని అన్నారు. లబ్ధిదారులు ప్రారంభించిన యూనిట్లన్నీ సక్సెస్ కావాలన్నారు. అందుకు వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాణించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. తక్కువ పెట్టుబడితో రాణిస్తున్న పలువురిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. లబ్ధిదారులు తమకు ఇష్టం ఉన్న రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. అందుకు అవసరమైన పూర్తి సహకారం ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న నాలుగు మండలాల్లో మన జిల్లాలోని చింతకాని మండలం ఉందన్నారు.
ఆర్థికంగా వెనుకబడిన దళితులను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తాను అనుకున్నది కచ్చితంగా చేసి చూపిస్తారన్నారు. నచ్చిన వ్యాపారం ఏదైనా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నదన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి అవకాశం ఇవ్వలేదన్నారు. లబ్ధిదారులు వందకు వంద శాతం తాము ఎంచుకున్న వ్యాపార రంగంలో విజయం సాధించాలన్నారు. ప్రభుత్వం సాయంగా అందజేసిన రూ.10 లక్షలను రూ.50 లక్షలు చేయడం ఎలా అన్న దిశగా లబ్ధిదారు వ్యాపారం చేయాలని ఆకాంక్షించారు. ఈర్ష్యా ద్వేషాలు పక్కన పెట్టి లబ్ధిదారులు వ్యాపారం చేసుకోవాలన్నారు.
లబ్ధిదారులు దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. రక్షణ నిధి ఎంతో ప్రయోజనకరమన్నారు. ప్రభుత్వం గతంలో అనుకున్న విధానాలకంటే భిన్నంగా ప్రస్తుతం పథకంలో కొన్ని మార్పులు చేసిందన్నారు. లబ్ధిదారులు ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చన్నారు. కుటుంబ సభ్యులు విడివిడిగా రెండు, మూడు వ్యాపారాలు చేసుకోవచ్చన్నారు. రెండు, మూడు యూనిట్లు కలిపి ఒక పెద్ద వ్యాపారం చేయవచ్చునన్నారు. గ్రామస్థాయిలో ఒక ప్రత్యేక అధికారికి పథకం అమలు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. సదస్సులో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, కలెక్టర్ వీపీ గౌతమ్, ఖమ్మం నగరపాలక కమిషనర్ ఆదర్శ్ సురభి, ఎస్సీ కార్పొరేషన్ అధికారి సత్యనారాయణ, ఎంపీపీ భూక్యా గౌరి, టీఆర్ఎస్ నాయకులు కుర్రా భాస్కర్‌రావు, అజ్మీరా వీరూనాయక్, మందడపు నర్సింహారావు, భూక్యా లక్ష్మణ్‌నాయక్, గుత్తా రవికుమార్, గొర్రె శ్రీనివాసరావు, బానోత్ రవిప్రకాశ్, చిట్టెం నర్సింహారావు, కొంటెముక్కల వెంకటేశ్వర్లు, సర్పంచ్ దేవ్‌సింగ్ పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నాలుగు మండలాల్లో జిల్లాలో ని చింతకాని మండలం ఒకటన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17 లక్షల కుటుంబాలకు అమలు చేయాలని నిర్ణయించగా ఒక్క ఖమ్మం జిల్లాలోనే 1.18 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో వంద మందితో ప్రారంభమైన ఈ పథకాన్ని మన్ముందు అర్హులందరికీ వర్తింపజే
స్తామన్నారు.
రఘునాథపాలెం, మార్చి 5: రఘునాథపాలెంలో 14 ఎకరాల్లో నిర్మితమయ్యే బృహత్ పల్లెప్రకృతి వనాన్ని జిల్లాకే ఆదర్శంగా నిలిచేలా సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. వనంలోని పనుల పురోగతిని శనివారం పర్యవేక్షించిన ఆయన.. అధికారులకు పలు సూచనలు చేశారు. ఇందులో నాటిన ప్రతి మొక్కకూ నీరందేలా డ్రిప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బండ్ చుట్టూ కొనసాగుతున్న బయో ఫెన్సింగ్ పనులను పర్యవేక్షించిన ఆయన, దానికి ఆనుకొని మొక్కలను నాటాలన్నారు. మెయిన్ గేట్ వాకింగ్ ట్రాక్, ఆట స్థలంలో ఆట వస్తువులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ ప్రాంతాలను గుర్తించి పరికరాలను అమర్చాలని సూచించారు. సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డీఆర్డీవో విద్యాచందన, మండల ప్రత్యేకాధికారి విజయలక్ష్మి, ఏఎంసీ మాజీ చైర్మన్ మద్దినేని వెంకటరమణ, రఘునాథపాలెం సర్పంచ్ గుడిపుడి శారద, టీఆర్ఎస్ నాయకులు మందడపు నర్సింహారావు, గుడిపుడి రామారావు, చెరుకూరి ప్రదీప్, కాంపాటి రవి, జాటోత్ సూర్య, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్ నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.