మధిర, జులై 04 : పేద విద్యార్థులకు చేయూతనందించడం అభినందనీయమని మధిర ఎంఈఓ వై.ప్రభాకర్ అన్నారు. శుక్రవారం ఆశాజ్యోతి ఫౌండేషన్ సౌజన్యంతో 100 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోటు పుస్తకాలను ఫౌండేషన్ సభ్యులు కోన లక్ష్మీ మోహన్రావు చేతుల మీద అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ.. విద్యార్థినీ విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని కష్టపడి చదువుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాక్షించారు. దాత కోన లక్ష్మీ మోహన్రావు మాట్లాడుతూ.. ఆశాజ్యోతి ఫౌండేషన్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో వేలాది మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, నోట్ బుక్స్ ప్రతి సంవత్సరం అందజేస్తున్నట్లు తెలిపారు. చిన్నారులంతా బాగా చదువుకుని తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం ఆర్.వీ.సత్యనారాయణ, మాధవరపు నాగేశ్వరరావు, కుడుముల వెంకట్రామిరెడ్డి, AAP చైర్మన్ బంక మాణిక్యమ్మ, మాజీ సర్పంచ్ మువ్వ వెంకయ్యబాబు, కళ్యాణపు రాజా, ఉపాధ్యాయులు ఎస్కే మదార్, జి.రామచంద్రారెడ్డి, ఆర్.బ్రహ్మారెడ్డి, వి.లక్ష్మీప్రసన్న, కె.సునీత, ఎండీ జమీర్, వి.లక్ష్మారెడ్డి పాల్గొన్నారు