Cyclone Montha | ఖమ్మం, కారేపల్లి : మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. హైదరాబాద్, కమ్మం, కరీంనగర్, వరంగల్ సహా పలు జిల్లాల్లో వర్షం పడుతోంది. తుఫాను ప్రభావంతో ఖమ్మం (Khammam) జిల్లాలో రెండు రోజుల పాటూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు.
జిల్లాలో అక్టోబర్ 29, 30 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు, ప్రజలకు సూచించారు. ఎక్కడా ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా మత్స్యకారులు ఎవరూ చేపలు పట్టేందుకు వెళ్లొద్దని సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావరొద్దని కలెక్టర్ సూచించారు.
Also Read..
Golconda Express | పట్టాలపైకి వరద నీరు.. డోర్నకల్లో గోల్కొండ ఎక్స్ప్రెస్ నిలిపివేత
Musi | ఉప్పొంగిన మూసీ.. పోచంపల్లి – బీబీనగర్ మధ్య రాకపోకలు బంద్
Crow | కుటుంబంలో ఒక్కటైన ‘కాకి’.. నల్గొండ జిల్లాలో వింత ఘటన