
అశ్వారావుపేట : అల్పపీడన ప్రభావంతో మండల వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. శనివారం మండలంలో భారీ వర్షం కురవగా వర్షపాతం 41.3 మిల్లీమీటర్లుగా నమోదయినట్లు స్థానిక వ్యవసాయ కళాశాల వాతావరణ పరిశీలకులు వైజికె మూర్తి తెలిపారు. భారీవర్షం కురవటంతో పట్టణంలోని రోడ్లు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలలో వరదనీరు చేరింది. చెరువులు నిండి జలకళతో సందడి చేస్తున్నాయి.