Karepalli | కారేపల్లి, జనవరి 30: ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాలలో శుక్రవారం తెల్లవారుజాము నుంచి దట్టమైన పొగమంచు కమ్ముకుంది. చలి తీవ్రత పెరగడంతో పాటు రోడ్లపై దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు, పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అటు పొగమంచు ప్రభావంతో మామిడి పూత మాడిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చలి పంజాకు తోడు మంచు మేఘాలతో జనజీవనం మందగించింది. సింగరేణి మండల పరిధిలోని ఖమ్మం-ఇల్లెందు ప్రధాన రహదారిపై పొగ మంచు కమ్ముకుని వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.ఇళ్ల మధ్యలో సైతం పొగ మంచు కమ్మేసింది. ఉదయం8:30 గంటల వరకు పొగ మంచు తగ్గలేదు. ఈ పొగమంచు కారణంగా ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని,ఫాగ్ లైట్లు ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.

Karepalli Fog