భద్రాచలం: కాళేశ్వరం ప్రాజెక్ట్ ( Kaleshwaram project ) అంశాన్ని సీబీఐ ( CBI ) కి అప్పగించడం బీజేపీ, కాంగ్రెస్ రాజకీయ కుట్రలో భాగమేనని బీఆర్ఎస్ (BRS) భద్రాచలం నియోజకవర్గ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ ( Ramprasad ) ఆరోపించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గొప్పగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్లను తరలించడానికి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నారన్నారు.
సీబీఐ విచారణ పేరుతో కేసీఆర్, హరీష్ రావును ముట్టుకుంటే తెలంగాణ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ తప్పుడు ప్రచారం చేసి తెలంగాణ పేరు ప్రతిష్ఠల్ని మంటగల్పడమే కాక,ఈ అంశాన్ని సీబీఐ విచారణకు సిఫార్సు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.