మణుగూరులో వడగళ్ల వాన
భద్రాద్రి జిల్లా మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. అశ్వాపురం మండలంలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
- అశ్వాపురం, దుమ్ముగూడెం మండలాల్లోనూ ఈదురుగాలుల వర్షం
- కల్లాల్లోని పంటలను కాపాడుకునేందుకు కర్షకుల ఉరుకులు పరుగులు
మణుగూరు టౌన్/ అశ్వాపురం/ దుమ్ముగూడెం/ పర్ణశాల, ఏప్రిల్ 30: భద్రాద్రి జిల్లా మణుగూరు, దుమ్ముగూడెం మండలాల్లో గురువారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. అశ్వాపురం మండలంలోనూ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉండడంతో ఉక్కపోత, వేసవితాపం నుంచి ఈ వర్షం కారణంగా ప్రజలకు కొంత ఉపశమనం కలిగింది.
అయితే, మణుగూరులో సుమారు గంటసేపు భారీ వర్షంతోపాటు వడగండ్లు కూడా కురిశాయి. అకస్మాత్తుగా వర్షం కురవడంతో వాహనదారులు, పాదచారులు, చిరువ్యాపారులు కొంత ఇబ్బంది పడ్డారు. అశ్వాపురం మండలం గోపాలపురం వద్ద ఈదురుగాలులకు ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకూలింది. దీంతో రహదారిపై వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో స్థానికులు, వాహనదారులు కలిసి కూలిన చెట్టును తొలగించారు. దీంతో సాయంత్రానికి ట్రాఫిక్ క్లియర్ అయింది.
మరోపక్క అన్నదాతలు పంట తడిచిపోకుండా ముందుగానే కల్లాల్లో పరదాలు కప్పి పంటను కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. దుమ్ముగూడెంలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా వడగండ్ల వర్షం కురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. డీజిల్ కొరతతో ఇప్పటికే ఓ పక్క వరికోతలు నిలిచిపోయాయి. ఇప్పుడు ఈ వర్షంతో ధాన్యం తడిచిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద ప్రధాన రహదారిపై చెట్లు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

