కొణిజర్ల, డిసెంబర్28 : రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని సర్పంచ్ పరికపల్లి శ్రీను అన్నారు. పెద్దమునగాల గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ రైతు బాంధవుడు, రైతుపక్షపాతి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రైతు బంధు సమితి గ్రామ శాఖ అధ్యక్షుడు కంచు బీరయ్య, సొసైటీ డైరెక్టర్ చెరుకుమల్లి శ్రీనివాసరావు, నాయకులు కృష్ణ, కావూరి అప్పారావు, రొంటే కృష్ణ, గడిపల్లి భిక్షం, జట్ల బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.