కొత్తగూడెం సింగరేణి, ఫిబ్రవరి 17: సింగరేణి యాజమాన్యం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (సీఎస్ఆర్)లో భాగంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ఢిల్లీలోని ‘ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ (ఈఈఎఫ్) అనే అంతర్జాతీయ సంస్థ సింగరేణి సేవలను గుర్తించి ప్లాటినమ్ విభాగంలో మొదటి బహుమతి గ్లోబల్ సీఎస్ఆర్ పురస్కారాన్ని ప్రకటించింది. గురువారం ఆన్లైన్లో నిర్వహించిన అంతర్జాతీయ పెట్రోకోల్ సదస్సులో ఈ మేరకు సంస్థ డైరెక్టర్ (పా) ఎన్.బలరాం అవార్డును స్వీకరించారు. కార్యక్రమంలో ఎనర్జీ ఎన్విరాన్మెంట్ ఫౌండేషన్ చైర్మన్ అనీల్ రజ్దాన్ మాట్లాడుతూ.. దేశ ఇంధన అవసరాలను తీర్చడంలో సింగరేణి ప్రధాన పాత్ర పోషిస్తున్నదన్నారు. అంకితభావంతో 150కి పైగా గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించిందని కొనియాడారు.