‘పీఎం శ్రీ’కి నారంవారిగూడెం పాఠశాల
కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ(ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా-ప్రధానమంత్రి భారతీయ వికసిత్ విద్య) పథకం కింద నారంవారిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది.
- సమగ్ర విద్యాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన కేంద్రం
- గత కేసీఆర్ ప్రభుత్వంలో ‘మన ఊరు-మన బడి’ కింద అభివృద్ధి
అశ్వారావుపేట, ఏప్రిల్ 2 : కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ(ప్రధానమంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా-ప్రధానమంత్రి భారతీయ వికసిత్ విద్య) పథకం కింద నారంవారిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎంపికైంది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం పాఠశాలకు ఐదేళ్లపాటు ఏటా రూ.75 వేలు, ఒక్కో విద్యార్థికి యూనిఫాం కుట్టేందుకు రూ.100, విద్యార్థినులకు ప్రత్యేకంగా రాణి రుద్రమ ఆత్మ రక్షక్ ప్రశిక్షణ్కు రూ.15 వేల చొప్పున నిధులు మంజారు చేస్తుంది. ఈ నిధులతో మండల విద్యాశాఖ ప్రత్యేకంగా విద్యార్థుల కోసం మౌలిక సదుపాయాలు కల్పించనున్నది. 2023-24 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ఈ పాఠశాలను ఎంపిక చేయగా.. రెండు రోజుల క్రితం నిధులు విడుదల చేసింది. పాఠశాల ఆధునీకరణకు ‘ఎంపీ శ్రీ’ నిధులు దోహదపడతాయని హెచ్ఎం చంద్రశేఖర్ తెలిపారు.
గత కేసీఆర్ ప్రభుత్వంలో రూ.27 లక్షల నిధులు
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు-మన బడి పథకాన్ని ప్రవేశపెట్టి ప్రతిష్టాత్మకంగా అమలు చేసింది. ఈ పథకం కింద రూ.27 లక్షలు మంజూరుకాగా.. పాఠశాలకు అవసరమైన అభివృద్ధి పనులను అధికారులు పూర్తి చేశారు. పాఠశాలలో రెండస్థుల భవనం, రెండు తరగతి గదులు, ఆఫీస్ గది, 10 నల్లాలతో తాగునీరు, పోలింగ్ బూత్ గదికి శాశ్వత మరమ్మతులు, వంట గది, బాలికలకు టాయిలెట్స్, గ్రీన్ బోర్డులు, ప్రతి తరగతి గదికీ 4 ఫ్యాన్లు, ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, ఫ్లోరింగ్, స్థూపం వంటి అభివృద్ధి పనులను పాఠశాల విద్యా కమిటీ పూర్తి చేసింది. దీంతో విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం ‘పీఎం శ్రీ’ పథకం కింద మంజూరైన నిధులు మరింత అభివృద్ధికి తోడ్పాటుగా ఉంటాయని పాఠశాల ఉపాధ్యాయులు చెబుతున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

