– సీఐటీయూ రాష్ట్ర నేత మోహన్ రావు
ఖమ్మం రూరల్, ఏప్రిల్ 01 : ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు, పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తూ మొత్తం కార్మిక వర్గానికి హాని చేసేలా తెచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ పెరుమాళ్లపల్లి మోహన్ రావు డిమాండ్ చేశారు. బుధవారం ఖమ్మం రూరల్ సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ క్రాస్ రోడ్లో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ రావు మాట్లాడుతూ.. కేంద్రం కొత్తగా తీసుకుని వచ్చిన నాలుగు లేబర్ కోడ్ల అమలు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ దేశమంతటా భారత కార్మిక సంఘాలు, ప్రాంతీయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తేదీ చీకటి రోజుగా భావించి నిరసన ప్రదర్శనలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
విద్యుత్ ప్రైవేటీకరణ ఆపు చేయాలని, ప్రభుత్వమే విద్యుత్ సంస్థలను నడపాలన్నారు. నిరసన ప్రదర్శనలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి మేడికొండ నాగేశ్వరరావు, మండల అధ్యక్షుడు పూరెల్లి రాములు, కార్యదర్శి గూడ రామబ్రహ్మం గౌడ్, ఆల్ ఆటో మొబైల్ షోరూం ఉద్యోగులు అండ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగ శ్రీనివాసరావు, కోశాధికారి ప్రవీణ్, బి.వెంకటేశ్వరరావు, కుమ్మరికంట్ల రాంబాబు, యాకూబ్, ప్రభాకర్, వీరయ్య, నాగయ్య, ముత్తయ్య, నాగభూషణం, చిరంజీవి, బాబు, మహేశ్, లింగయ్య పాల్గొన్నారు.