ఎర్రుపాలెం, డిసెంబర్ 5 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో చేస్తున్నది ప్రజా పాలన కాదని.. రాక్షస పాలన అని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్‌రాజు మండిపడ్డారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను గురువారం సందర్శించేందుకు స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి వెళ్తుండగా.. అధికారుల అనుమతి లేకుండా వెళ్లొద్దని అడ్డుకున్న పోలీసులు కమల్రాజుతోపాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, పలువురు నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు మాట్లాడారు. రాష్ట్రంలో 400 ఉన్న గురుకుల పాఠశాలలను వెయ్యికి పెంచిన ఘనత గత కేసీఆర్ ప్రభుత్వానిదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వాటి పరిస్థితి అధ్వానంగా మారిందని ఆరోపించారు. ఫుడ్ పాయిజన్ తదితర కారణాలతో ఇప్పటివరకు 50 మంది విద్యార్థులు మృతిచెందడం బాధాకరమన్నారు.
గురుకుల పాఠశాలల్లో మౌలిక వసతులపై అధ్యయనం చేయాలనే మాజీ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో.. ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్ పిలుపులో భాగంగా ఇక్కడికి వస్తే అనుమతి లేదని అడ్డుకోవడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్రంలో నిర్బంధ, అక్రమ కేసులతో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. డిప్యూటీ సీఎం ఇలాకాలో ప్రతిపక్షాన్ని అణచివేసే కుట్రలో భాగంగానే తమను అడ్డుకున్నారని ఆరోపించారు.
గురుకుల విద్యార్థుల సమస్యలతోపాటు అన్ని సమస్యలపై కేసీఆర్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగడుతామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, నాయకులు రామకోటేశ్వరరావు, శ్రీనివాసరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, కృష్ణారావు, భాస్కర్‌రావు, తిరుపతిరావు, భాస్కర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, చిన్నబాబు, కిశోర్‌బాబు, పుల్లారెడ్డి, ప్రకాశ్, దేవరకొండ రవి, పవన్, ప్రవీణ్, వెంకటేశ్వర్లు, కృష్ణ, బాలరాజు, ఇస్మాయిల్, స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.