బోనకల్లు, నవంబర్ 27: ఖమ్మంలో శుక్రవారం జరిగే దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. మండలంలోని రావినూతల గ్రామంలో బుధవారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యమసారథి కేసీఆర్ దీక్షా ఫలమే ఇప్పటి తెలంగాణ రాష్ట్ర స్వేచ్ఛావాయువులని గుర్తుచేశారు.
స్వరాష్ట్ర సారథి కేసీఆర్ త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు బంధం శ్రీనివాసరావు, చేబ్రోలు మల్లికార్జునరావు, మోదుగుల నాగేశ్వరరావు, కొమ్మినేని ఉపేందర్, కాకాని శ్రీనివాసరావు, బెజవాడ మల్లికార్జున్, కంచర్ల బాబు, వెంగళ కనకయ్య, ఇటికాల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.