మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రజలకు సూచించారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 12వ వార్డుల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్‌లో జరిగిన రోడ్ షోలో నామా మాట్లాడుతూ కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో రాష్ట్రంలోని ఒక మున్సిపాలిటీ కూడా అభివృద్ధి చెందలేదని, గ్రామపంచాయతీల పరిస్థితి కూడా అధ్వానంగా మారిందన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనంలో జరిగిన అభివృద్ధి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని ఆరోపించారు.
వైరా మున్సిపాలిటీ అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ కూటమి బలపరిచిన సీపీఐ , సీపీఎం అభ్యర్థులు కట్టా స్వరూపరాణిని గెలిపించాలని కోరారు. మెజార్టీ వార్డు కౌన్సిలర్ స్థానాలను గెలుచుకొని మున్సిపాలిటీపై ఎర్ర గులాబీ జెండా ఎగురవేయాలని ఆయన ఆకాంక్షించారు. ప్రచార కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బానోతు చంద్రావతి, బీఆర్ఎస్ నాయకులు లకావత్ గిరిబాబు, బానోతు మంజులా మదన్‌లాల్, సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్, జిల్లా కమిటీ సభ్యులు బొంతు రాంబాబు, వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి యర్రా బాబు తదితరులు పాల్గొన్నారు.