ఇల్లెందు, అక్టోబర్ 20: రాష్ట్రంలో రైతులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా కింద ఎకరాకు 15వేల ఇస్తానని నేటికి రైతుభరోసా ఇవ్వని సీఎం రేవంత్రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా నాయక్ డిమాండ్ చేశారు. ఆదివారం ఇల్లెందు పట్టణంలో జగదాంబ సెంటర్ నుంచి పాత బస్టాండ్ వరకు రైతులు, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రైతు భరోసా వెంటనే అమలు చేయాలని ర్యాలీ నిర్వహించి పాత బస్టాండ్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి రైతుభరోసా ఇవ్వలేమని సాక్షాత్తు మం త్రి తుమ్మల వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. రైతులకు ఇచ్చిన హామీలలో ప్రభుత్వం రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదన్నారు. కార్యక్రమంలో నాయకులు దిండిగల రాజేందర్, సిలివేరు సత్యనారాయణ, జేకే శ్రీను, దేవిలాల్,అజ్మీర బావుసింగ్, శీలం రమేశ్, ఖమ్మంపాటి రేణుక, పరుచూరి వెంకటేశ్వర్లు, దాస్యం ప్రమోద్, అబ్దుల్ నబీ, జబ్బర్, మహేందర్, ఆదురి రవి, యలమద్ది రవి, హరిప్రసాద్, వాసు తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి, అక్టోబర్ 20: రాష్ట్రంలో రైతులకు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం రైతుభరోసా వెంటనే అమలు చేయాలని మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా నాయక్ అన్నారు.
ఆదివారం స్థానిక బస్స్టాండ్ సెంటర్లో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బోడ బాలునాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు రైతులు, బీఆర్ఎస్ నాయకుల ధర్నా చేపట్టారు. హరిప్రియనాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ పూర్తి అయినా రైతులకు రైతుభరోసా అందక పెట్టుబడి కోసం ఇబ్బందులుపడుతున్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో రైతులకు పెట్టుబడి సాయం సీజన్ల ప్రకారం సకాలంలో అందేదన్నారు. అధికారం కోసం అమలుకాని హామీలు ఇచ్చి రేవంత్రెడ్డి ప్రభుత్వంరైతులను, ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో బేతంపూడి సొసైటీ చైర్మన్ లక్కినేని సురేందర్రావు, నాయకులు బానోత్ కిషన్, చీమల సత్యనారాయణ, జాలది అప్పారావు, బర్మవత్ శివ, కుమ్మరి కిరణ్కుమార్, బాలకృష్ణ, మాలోత్ పూల్సింగ్, అజ్మీర గలక, బానోత్ ఈరు, భూక్యా లాలునాయక్, సురేశ్, మూడ్ బాలు, శివ, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు టౌన్, అక్టోబర్ 20: ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 300రోజులు దాటినా ఇప్పటి వరకు ఇచ్చిన హామీ లు నెరవేర్చలేదని, రైతులకు ఇప్పటి వరకు రైతుభరోసాను అందించలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ నేతలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. నాయకులు మా ట్లాడుతూ… రైతుభరోసా లేకపోవడంతో పంటలకు పెట్టుబడులు పెట్టలేక, అధిక వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి సరైన దిగుబడి రాక రైతు దిగాలు పడుతున్నారన్నారు.
ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడాలని అన్నా రు. రైతులకు మేలు చేసే ప్రభుత్వమని చెప్పుకోవడం కాద ని, చేతల్లో చూపించాలని అన్నారు. రూ. 2లక్షల రుణమాఫీ కూడా సగం మంది రైతులకే చేశారని, మిగిలి న వారు రుణమాఫీ కాలేదని ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చే యాలన్నారు. రాస్తారోకో చేస్తున్న విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు అక్కడికి చేరుకొని బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. కార్యక్రమంంలో నాయకులు పోశం నర్సింహారావు, అడపా అప్పారావు, ముత్యం బా బు, కురి నాగేశ్వరరావు, వట్టం రాంబాబు, నూకారపు రమేశ్, యాదగిరి గౌడ్, లక్ష్మణ్, కోటి, రంజిత్, రవి పాల్గొన్నారు.