ఖమ్మం రూరల్, సెప్టెంబర్ 29 : బీఆర్ఎస్ పార్టీ సానుభూతిపరుడు చేకూరి తిరుపతయ్య (75) మృతి పట్ల వైరా మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ బానోత్ చంద్రావతి తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ నివాళి అర్పించారు. ఎదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గుడిమల్ల గ్రామానికి చెందిన తిరుపతయ్య సోమవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతిచెందాడు. మృతదేహాన్ని మాజీ ఎమ్మెల్యే సందర్శించి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం అదే గ్రామంలో ఇటీవల మరణించిన కొనకంటి కమలమ్మ ఇంటికి వెళ్లి కమలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కమలమ్మ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.