కారేపల్లి,సెప్టెంబర్ 7 : ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి)మండలం నుండి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన బానోత్ శామ్ లాల్, బానోత్ సీతారాములును వైరా మాజీ శాసన సభ్యురాలు డాక్టర్ బానోత్ చంద్రావతి ఆదివారం ఖమ్మం పట్టణంలోని ఆమె నివాసంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్ది తమ వృత్తికి వన్నె తెచ్చి జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో టీఎస్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బానోత్ వీరు నాయక్, జిల్లా అధ్యక్షులు మంగ్య నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్, శ్యామ్ లాల్, లింగ, రాందాస్, కిషన్ రాథోడ్, రాంజీ, శ్రీను, సీతారాములు, కిషన్, చిరంజీవి వివిధ మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.