ఆరోగ్యంపై దృష్టి పెట్టండి..
ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
- భద్రాద్రి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్
కొత్తగూడెం టౌన్, ఏప్రిల్ 10 : ఆరోగ్యానికి మించిన సంపద మరొకటి లేదని, ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై దృష్టి సారించాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్ అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో బుధవారం కొత్తగూడెం కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచడం, ఆరోగ్యం ప్రాముఖ్యతను తెలియజేయడమే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రాముఖ్యత అని అన్నారు. వాతావరణం, పర్యావరణ కాలుష్యం, సామాజిక పరిస్థితులు, ప్రకృతి విపత్తులు తదితర అనేక అంశాలు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని,
ఇందుకోసం ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గొల్లపూడి భానుమతి మాట్లాడుతూ వైద్య శిబిరంలో పరీక్షలు చేయించుకున్న వారికి అవసరమైన మందులు కూడా ఉచితంగా అందిస్తామన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మూడు నెలలకోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంగా ఉంటేనే మానసికంగా దృఢంగా ఉంటారని పేర్కొన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు బత్తుల రామారావు, కే.సాయిశ్రీ, ఏపీపీ పోసాని రాధాకృష్ణమూర్తి, ఏజీపీ ఏపూరి బాబురావు, తోట మల్లేశ్వరరావు, గాజుల రాంమూర్తి, శెట్టిపల్లి వెంకట రామారావు, చిరంజీవిరావు, ఎర్రపాటి కృష్ణ, వై.నాయుడు, మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

