రైతుల సమస్యలపై పోరాటం : మిడకంటి వెంకట్ రెడ్డి
రైతులకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మీడకంటి చిన్న వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండల కార్యాలయం ముందు రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో..
– ఖమ్మం రూరల్ తాసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఖమ్మం రూరల్, జూన్ 23 : రైతులకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మీడకంటి చిన్న వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండల కార్యాలయం ముందు రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలన్నారు. వానాకాలం రైతు భరోసా నిధులను ఒకే దఫాలో విడుదల చేయాలని, పెరిగిన కాంప్లెక్స్ ఎరువుల ధరలను తగ్గించాలన్నారు. అలాగే మార్కెట్లో నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రయాలను అరికట్టాలన్నారు.
రూ.2 లక్షలకు పైబడిన వ్యవసాయ రుణాలను కూడా మాఫీ చేయాలని కోరుతూ పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఖమ్మం రూరల్ తాసీల్దార్ వినయేందర్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర సమితి సభ్యుడు బానోతు రామకోటి, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడ్లపల్లి శంకరయ్య, పాసంగుల చందర్రావు, ఏలూరి భాస్కరరావు, వెన్నం భాస్కరరావు, మామిడి సుదర్శన్ రెడ్డి, మండల నాయకులు మెడకంటి పెద వెంకటరెడ్డి, గణపరపు నాగయ్య, గూడా బాబురెడ్డి, శ్రీనివాసరెడ్డి, బొడ్డు ఉపేందర్, గంధం రవి, భూక్యా నాగరాజు, అబుబకర్ దస్తగిరి పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

