మధిర, ఏప్రిల్ 14 : అకాల వర్షానికి పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం మధిర డివిజన్ కార్యదర్శి మడుపల్లి గోపాలరావు అన్నారు. సోమవారం అకాల వర్షాల కారణంగా మండలంలోని మల్లారం గ్రామంలో కల్లాల్లో తడిచిన మిర్చిని ఆయన పరిశీలించి మాట్లాడారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తుఫాన్ నష్టాన్ని అంచనా వేయాలని, రైతులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
అసలే ప్రస్తుతం ధరలు తక్కువగా ఉండటం వల్ల మిర్చి రైతులు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయారన్నారు. మూలిగే నక్క పై తాటికాయ పడ్డట్లు తుఫాన్ మరింత దెబ్బతీసిందన్నారు. మిర్చి, మామిడి, మొక్కజొన్న, పెసర, వరి రైతులను తుఫాన్ తీవ్రంగా నష్టపరిచిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మందా సైదులు, మల్లారం మాజీ సర్పంచ్ మందడపు ఉపేంద్ర రావు, షేక్ ఉద్దండు సాహెబ్, చావ వంశీకృష్ణ, వెంకటేశ్వరరావు, మచ్చ అప్పారావు, కొంగర విశ్వేశ్వరరావు, సంపసల గోపాలరావు, మచ్చ రామారావు, కొంగర రాంబాబు, కొంగర రంగా, పారుపల్లి వెంకటేశ్వరరావు, ఎర్రనాగుల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.