ఇల్లెందు, అక్టోబర్ 16 : రైతులు తమ పత్తి పంటను సీసీఐ కేంద్రాల వద్దనే అమ్ముకోవాలని ఇల్లందు వ్యవసాయ శాఖ యార్డ్ గ్రేడ్-3 కార్యదర్శి నరేష్ కుమార్ అన్నారు. గురువారం ఇల్లెందు మార్కెట్ యార్డ్లో కంపాస్ కిసాన్ యాప్ గురించి రైతులు తమ పత్తి పంటను సీసీఐ కేంద్రాల వద్ద అమ్ముకొనుటకు స్లాట్ బుకింగ్ ఎలా చేయాలో అనే విషయంపై అవగాహన కొరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రైతులు తమ పండించిన పంటలను సీసీఐ కేంద్రాల వద్ద అమ్మాలంటే ముందు కపాస్ కిసాన్ యాప్లో రైతుల వివరాలు అప్లోడ్ చేయించుకోవాలని వాటి కొరకు ఎలాంటి వివరణ కొరకైనా రైతులు ఇల్లందు వ్యవసాయ శాఖలో ఉన్న ప్రత్యేక సెల్లులో వద్దకు వచ్చి వివరాలు తెలుసుకోగలరని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, మార్కెట్ సూపర్వైజర్ శ్రీనివాసరావు, సిబ్బంది రంజిత్, మధు, రవి, సందీప్ మునియార్, లక్ష్మి, విజయ తదితరులు పాల్గొన్నారు.