కారేపల్లి, సెప్టెంబర్ 19 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి (కారేపల్లి) మండలం మాణిక్యారం గుడితండాలో శుక్రవారం గుండెపోటుతో రైతు మృతి చెందాడు. గుడితండాకు చెందిన భూక్య కోటయ్య (49) ఉదయం చాతి నొప్పితో కింద పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించే లోపే చనిపోయాడు. కోటయ్యకు భార్య పూష, ఇద్దరు కుమారులు ఉన్నారు. కోటయ్య మృతదేహాన్ని స్థానిక మాజీ ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, గ్రామ పెద్దలు సందర్శించి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.